విద్యార్థులే రోడ్డు భద్రతకు మార్గదర్శకులు: కలెక్టర్
BDK: పాత కొత్తగూడెం హనుమాన్ బస్తీలో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని కలెక్టర్ అంకిత్ బుధవారం ప్రారంభించారు. విద్యార్థులు నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు చిన్నప్పటి నుంచే అలవాటు కావాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.