VIDEO: చలివేంద్రంలోని కుండ ఎత్తుకెళ్లిన దొంగ

WGL: చలివేంద్రంలో ఏర్పాటు చేసిన నీటి కుండ దొంగతనం చేసిన ఘటన వరంగల్ హంటర్ రోడ్డులో జరిగింది. వేసవి కాలం ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసిన చలివేంద్రంలో కుండను ఒక ఆటో వ్యక్తి దొంగతనం చేసి ఆటోలో తీసుకెళ్లాడు. చలివేంద్రం నిర్వాహకులలో ఒకరైన ప్రతాప్ రెడ్డి దీనిని సీసీటీవీ ఫుటేజ్‌లో గమనించారు. దీనికి సంబంధించ ఫుటేజ్ మీడియాకు ఇచ్చారు.