రేపు ఉదయగిరి రానున్న SP
NLR: ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారం సాయంత్రం 5 గంటలకు SP డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. సర్కిల్ పరిధిలోని ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ప్రజలు తమ సమస్యలు ఏమైనా ఉన్నా ఈ కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.