బార్&రెస్టారెంట్‌లో కుళ్ళిన చికెన్.. కేసు నమోదు

బార్&రెస్టారెంట్‌లో కుళ్ళిన చికెన్.. కేసు నమోదు

ADB: జిల్లా కేంద్రంలోని వరుణ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూష తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కిచెన్‌లో కుళ్ళిన చికెన్‌ను గుర్తించారు. చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసి ఇస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. నిషేధిత ఫుడ్ కలర్స్ వాడకం, కాలం చెల్లిన సాస్లు, లేబుల్ లేని 8 కిలోల జీడిపప్పును సీజ్ చేశారు. కుళ్ళిన చికెన్ గుర్తించి, శాంపిల్స్ సేకరించి రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు.