VIDEO: పట్టపగలే చోరీకి దిగిన దుండగులు..!
అన్నమయ్య: నూలివీడు గ్రామంలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. సిబ్యలా ప్రమిలమ్మ ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి సుమారు 10 తులాల బంగారం, కొంత వెండి నగలు, నగదును అపహరించారు. సమాచారం అందుకున్న గాలివీడు ఎస్సై నరసింహారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో చోరీ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.