ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు

MHBD: జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్‌ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ప్రసాదాలను అందజేశారు. 4వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు గుండా మల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలపై చర్చించారు.