వైద్యం వికటించి వివాహిత మృతి
KDP: వైద్యం వికటించి మైదుకూరు పట్టణానికి చెందిన వివాహిత(34) గురువారం మృతి చెందినట్లు తెలుస్తోంది. గుండెల్లో నొప్పిగా ఉందని పట్టణంలోని మందుల దుకాణం వద్దకు వెళ్లగా దుకాణం యజమాని సెలైన్ ఎక్కించి అందులో మందులు వేసినట్లు సమాచారం. కొద్దిసేపటికి ఆమె మృతి చెందగా కొందరు మధ్యవర్తిత్వం చేసి బయటికి రాకుండా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.