రేపు రొద్దంలో పర్యటించనున్న మంత్రి సవిత

రేపు రొద్దంలో పర్యటించనున్న మంత్రి సవిత

సత్యసాయి: రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో మంత్రి సవిత సోమవారం పర్యటించనున్నట్లు టీడీపీ కన్వీనర్ నరహరి తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు రొద్దం మండలంలోని సానిపల్లిలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. 11 గంటలకు మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవన్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.