అటువంటి ఉపాధ్యాయులను వదలొద్దు: కలెక్టర్

అటువంటి ఉపాధ్యాయులను వదలొద్దు: కలెక్టర్

ప్రకాశం: జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. అనంతరం జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు.