ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా జెట్ విమానం
ఇరాక్‌లో అమెరికా జెట్ విమానం కుప్పకూలింది. ఇది యుద్ధ విమానాలకు గాలిలోనే ఇంధనాన్ని నింపే(Refueling) విమానమని US సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మరణించారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇది సాంకేతిక లోపమా లేక శత్రువుల దాడి అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.