రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు-MLA వినోద్

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు-MLA వినోద్

MNCL: కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మాలని సూచించారు. నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.