VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన
VZM: తెర్లం మండలం గదబవలసలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బాబా వారికి గురువారం భక్తులు కుంకుమపూజలు చేశారు. అనంతరం బాలవికాస్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ నెల 23 వరకు ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.