స్కూల్‌లో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి రూ. 20,000 అందజేత
తూ.గో: గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామ మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలో విద్యార్థులు త్రాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు బీజేపీ నేత, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావును కలిసి వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహాయం అందించాలని కోరారు. ఆయన వెంటనే స్పందించి రూ. 20,000 పాఠశాల ఉపాధ్యాయునికి గురువారం అందజేశారు.