నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NRML: నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినినగర్ 11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ నాగరాజు తెలిపారు. భాగ్యనగర్, ఎన్టీఆర్ మార్క్, రాంనగర్, ఆశ్రా కాలనీ, విజయనగర్ కాలనీ, మారుతి ఇన్ ఏరియాలో సరఫరా నిలిపివేయబడుతుందన్నారు.