ప్రతినెలా రూ.3,000 పెన్షన్.. తెలుసా?

ప్రతినెలా రూ.3,000 పెన్షన్.. తెలుసా?

చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం 'PM-Kisan Maandhan Yojana'ను అమలు చేస్తోంది. 18-40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 చొప్పున పొదుపు చేయాలి. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. రైతు మరణిస్తే భాగస్వామికి 50% పెన్షన్ అందిస్తారు. రైతులు ఆధార్, బ్యాంకు వివరాలతో 'మీసేవ', CSC కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు.