పత్తి కొనుగోళ్లు నిలిపివేత

పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ADB: చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని ఐదు జిన్నింగ్ మిల్లులలో పత్తి నిలువలు పెరిగిపోవడంతో బుధవారం నుంచి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. పత్తి కొనుగోళ్ల ప్రారంభ తేదీని ప్రకటించేంత వరకు పత్తి వాహనాలు తీసుకొని రావద్దు అని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు.