కాంగ్రెస్‌లో చేరిన మాజీ కో-ఆప్షన్ సభ్యుడు
WNP: పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఫజల్ అహ్మద్ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సత్య రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్‌లో ఇబ్బందులు ఎదురవడంతోనే ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్‌లో చేరినట్లు ఫజల్ అహ్మద్ తెలిపారు.