VIDEO: వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు

VIDEO: వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు

ASF: అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేసే వారి ఇళ్లల్లో మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో పోలీసులు ఏకకాలంలో బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాడులు కొనసాగాయి. వారి ఇళ్లల్లో లభించిన ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, చెక్కులు, స్థలాల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.