పాఠశాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

NRPT: ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన బాలుర గురుకులంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి మొక్కలు నాటారు. వన మహోత్సవంలో భాగంగా స్వచ్ఛదనం-పచ్చదనం నిర్వహించారు. ఈ మేరకు ఆమె ఉసిరి, మహాగని మొక్కలు నాటారు. తన నియోజకవర్గంలో 8 లక్షల మొక్కలను నాటుతామని తెలిపారు. కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.