నారాయణపురంలో యాచకుడు మృతి

నారాయణపురంలో యాచకుడు మృతి

TPT: నారాయణపురం మండలం కళ్యాణపురంలోని చిదా స్పిన్నింగ్ మిల్లు ఎదురుగా మర్రి చెట్టు కింద ఓ యాచకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి పది గంటలకు చనిపోయినట్లు సమాచారం. చుట్టుపక్కన వారిని విచారించగా గత కొద్ది కాలంగా ఇక్కడే భిక్షాటన చేసుకుని నివసిస్తున్నట్లు తెలియాజేశారు. స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందజేశారు.