'మహనీయుల ఆశయ సాధనకు కృషి'
PDPL: మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో ఇవ్వాళ నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చిన్నతనంలో అంటరానితనం అనుభవించి, ఉపప్రధాని స్థాయి వరకు ఎదిగారని కొనియాడారు. అధికారులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.