అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

MDCL: చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్యలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం బోయిన్‌పల్లిలో అంగన్‌వాడీ టీచర్లకు ఆయన స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యమని, డిజిటల్ విధానం పర్యవేక్షణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీచర్లు పాల్గొన్నారు.