సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం, కొత్త రేవు పోలవరం గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మండల TDP అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, పీఏసీఎస్ చైర్మన్ గుర్రం రామకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు.హోం మంత్రి అనిత చొరవతో రెండు గ్రామాల్లో 6 రహదారుల నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు కోడ లోవరాజు పాల్గొన్నారు.