పోలీస్ శాఖకు బొలెరో అందజేసిన ఎమ్మెల్యే

పోలీస్ శాఖకు బొలెరో అందజేసిన ఎమ్మెల్యే

W.G: జిల్లాలో పోలీస్ శాఖ మరింత వేగవంతం, సమర్థవంతమైన సేవలను అందించాలని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు. ఉండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి P4 కార్యక్రమంలో భాగంగా ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వినియోగార్థం మహీంద్రా బొలెరో నియో N10 వాహనాన్ని బుధవారం ఎస్పీ, భీమవరం డీఎస్పీ ద్వారా అందించారు. ఈ మేరకు పోలీస్ శాఖ డిప్యూటీ స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.