దోమకొండ కోట చరిత్ర మీకు తెలుసా?
KMR: దోమకొండకోట కేవలం ఒక కట్టడం కాదు, అది 18వ శతాబ్దపు అద్భుత కళాఖండం. మొఘల్, రాజస్థానీ శైలి కలయికతో కూడిన వాస్తుశిల్పాన్ని అధ్యయనం చేయవచ్చు. కోట లోపలి 'అద్దాల మేడ'లో అలంకరణలు, చెక్కతో చేసిన కిటికీలు ఆనాటి కళాపోషణకు నిదర్శనం. యునెస్కో మెరిట్ అవార్డు పొందిన ఈ కోటలో రక్షణ కోసం నిర్మించిన భారీ బురుజులు, రాతి ప్రాకారాలు శత్రువు నుంచి రక్షణ పొందే వ్యూహాలను చూడొచ్చు.