బస్టాండ్ ప్రారంభించిన : ఎమ్మెల్యే

తూ.గో: అనపర్తి మండలం కుతుకులూరులో గ్రామానికి చెందిన పడాల రామారెడ్డి ఆదిలక్ష్మి దంపతులు ఆర్థిక సౌజన్యంతో నిర్మించిన ఆర్కే బస్టాండ్ ను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామారెడ్డి దంపతుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హేమ తులసి, ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.