VIDEO:పెన్షన్ తీసివేస్తామన్న వదంతులను నమ్మొద్దు: కలెక్టర్

CTR: జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ ఏర్పాటు చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్కరు అభద్రతా భావానికి గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్లను తీసివేస్తామన్న వదంతులను నమ్మొద్దన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని చెప్పి, సదరం సర్టిఫికేట్లను పరిశీలించారు.