'ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి'
ADB: సాత్నాల మండల పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎంపీడీఓ వెంకట్‌రాజు, తహసీల్దార్ జాదవ్ రామారావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని కాన్ప మేడిగూడ రైతు వేదికలో మండల పరిధిలోని అభ్యర్థులకు ఎన్నికల వ్యయం పై మండల ఏఈఓ కవితచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.