కార్డాన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు

NRPT: దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో బుధవారం పోలీసులు కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఇళ్లలో ఉన్న వారి వివరాలను తెలుసుకున్నారు. ఆధార్ కార్డులను, వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 24 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు కార్డాన్ సర్చ్ నిర్వహించామని చెప్పారు. ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.