రామాలయ భూమి వివాదానికి ఎమ్మెల్యే పరిష్కారం

రామాలయ భూమి వివాదానికి ఎమ్మెల్యే పరిష్కారం

HYD: నాగోల్ డివిజన్ బండ్లగూడలో నిర్మాణంలో ఉన్న రామాలయ భూమికి సంబంధించిన వివాదం చోటు చేసుకుంది. దేవాలయ ఆవరణ నుంచి దారి కావాలని కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో దేవాలయ కమిటీ సభ్యులు ఈ అంశాన్ని MLA సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వేంటనే స్పందించిన MLA, GHMC అధికారులతో కలిసి స్థలాన్నీ పరిశీలించి, ప్రైవేట్ పత్రాలు నకిలీవని నిర్ధారించారు.