ICET పరీక్షా కేంద్రాలు ఇవే..

ICET పరీక్షా కేంద్రాలు ఇవే..

KRNL: MBA, MCA ప్రవేశాల కోసం నేడు జరిగే ఐసెట్‌కు జిల్లా అభ్యర్థులు సిద్ధమయ్యారు. రాయలసీమ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నేటి ఉదయం 9నుంచి 11.30 వరకు, మ. 2 నుంచి 4.30 వరకు 2 సెషన్స్‌లో ఈ పరీక్ష జరగనుంది. జిల్లాలో భీమా కాలేజి, అయాన్ డిజిటల్ జోన్, ఎమ్మిగనూరులో 3 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 1,489 మంది హాజరుకానున్నారు.