ఆదోని జిల్లా సాధనకై మహిళల దీక్ష
KRNL: ఆదోని జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. పట్టణంలో కొనసాగుతున్న జిల్లా సాధన దీక్ష ఆదివారం 29వ రోజుకు చేరుకుంది. ఈ ఉద్యమానికి మద్దతుగా మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ఎన్జీవో అధ్యక్షురాలు ఉషారాణి, పీవోడబ్ల్యూ నాయకురాలు సుజ్ఞానమ్మ వారిని ఆహ్వానించారు. జిల్లా సాధన కోసం పల్లెల ప్రజలు కూడా ఆందోళనలో పాల్గొనాలని నాయకులు కోరారు.