తెలంగాణ గవర్నర్‌ను కలిసిన టీటీడీ ఛైర్మన్
TPT: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను హైదరాబాద్ గవర్నర్ బంగ్లాలో బుధవారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ను శ్రీవారి శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందించారు. టీటీడీలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని, కల్పిస్తున్న సౌకర్యాలు భేషుగ్గా ఉన్నాయని గవర్నర్ అభినందించారు.