సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై ఫిర్యాదు

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో కొంతమంది సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై అసత్యాలతో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్‌ను గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు ఉదయ శంకర్ కోరారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీని వారు కలిసి సమస్య వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ప్రశాంత్, ధనిశెట్టి రాము పాల్గొన్నారు.