VIDEO: రోడ్డు ప్రమాదంలో యువకుడుకి గాయాలు
అన్నమయ్య: మదనపల్లి మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల చరణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన చరణ్‌ను వారు జిల్లా ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.