ఎకరం రూ.100 కోట్లు.. 18 ఎకరాలు అమ్మేశా: శివాజీ
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ప్రమోషన్స్‌లో శివాజీ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గతంలో HYDలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో తనకు ఉన్న 18 ఎకరాల భూమిని అమ్మేసినట్లు శివాజీ తెలిపాడు. 'ప్రస్తుతం అక్కడ ఎకరం ధర దాదాపు రూ.100 కోట్లు పలుకుతోంది.. కనీసం ఒక్క ఎకరమైనా ఉంచుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది' అని వ్యాఖ్యానించాడు.