VIDEO: చేపల వేటకు వెల్లి వృద్ధుడికి గాయాలు

VIDEO: చేపల వేటకు వెల్లి వృద్ధుడికి గాయాలు

అన్నమయ్య: మదనపల్లి మండలం సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు శనివారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బండరాయిపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మల్‌రెడ్డి చెరువు సమీపంలో చోటుచేసుకుంది. గమనించిన పశువుల కాపరులు వెంటనే అతన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.