ఈ నెల 26న జిల్లాలో వ్యాసరచన పోటీలు

ఈ నెల 26న జిల్లాలో వ్యాసరచన పోటీలు

గుంటూరు పాత బస్టాండ్‌లోని పరీక్షా భవనంలో విద్యార్థులకు ఈ నెల 26న వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్ల సహాయంతో మండల స్థాయి విజేతలను జిల్లా పోటీలకు పంపాల్సిందిగా సూచించారు.