తెలుగువారిని రక్షించిన లోకేష్: ఎమ్మెల్యే

BPT: నేపాల్‌లో హింసాత్మక ఘటనల కారణంగా చిక్కుకుపోయిన 215 మంది తెలుగువారిని రక్షించి, స్వస్థలాలకు చేర్చడంలో మంత్రి లోకేష్ చేసిన కృషి అభినందనీయమని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కొనియాడారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. లోకేష్ స్పందించి, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్‌ను కమాండ్ కంట్రోల్ రూమ్‌గా మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారని తెలిపారు.