టికెట్ ధరలపై నిర్మాత సాహు కామెంట్స్
టికెట్ ధరలపై నిర్మాత సాహు గారపాటి కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఏడాదిలో 50 రోజులు మాత్రమే పెంచే టికెట్ ధరల గురించి అందరూ మాట్లాడుతున్నారని, థియేటర్లలో అమ్మే ఖరీదైన తినుబండారాల గురించి ఎవరు మాట్లాడలేదన్నాడు. ఒక్కో థియేటర్‌లో ఒక్కో ధర ఉందని, ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా ఈ అంశం ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని పేర్కొన్నాడు.