టీటీడీకి బ్యాటరీ వాహనాలు విరాళం

TPT: బెంగళూరుకు చెందిన భక్తుడు చంద్రశేఖర్ మంగళవారం తిరుమలలో టీటీడీకి రూ.11 లక్షల విలువ గల రెండు, ఆరు సీటర్ల బ్యాటరీ వాహనాలను విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనాలకు టీటీడీ అర్చకులు పూజ చేశారు. అనంతరం వాహన తాళాలు ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథంకు అందజేశారు. టీటీడీ అధికారులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.