పోలీసుల తనిఖీలు.. 11 బైకులు స్వాధీనం

చిత్తూరు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల పరిశీలన, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో 11 బైక్లు, 30 ప్యాకెట్ల సారా స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.