ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను గురువారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేసి, ట్రాఫిక్ నిర్వహణలో ఉన్న సవాళ్లు, అవకాశాలను గురించి చర్చించారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాల పార్కింగ్ మరియు నిర్వహణను పరిశీలించారు. ఇది కాకుండా, ఇతర ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులపై చర్చించారు.