హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు.. టీకాల పంపిణీ
KNR: కరీంనగర్ షాలిమార్ ఫంక్షన్ హాల్‌లో హజ్ యాత్రికులకు నిర్వహిస్తున్న శిక్షణ, వ్యాక్సినేషన్ క్యాంప్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా 139 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి టీకాలు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి రెండు రకాల వ్యాక్సిన్లు (SIV, QMMV), ఇతరులకు ఒక టీకా వేశారు.