'విజన్-2047 ప్రాజెక్టుల లక్ష్యంగా పనిచేయండి'
ELR: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌రావు దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో విజన్- 2047 ప్రాజెక్టులో భాగంగా సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన లాప్‌టాప్ పరికరాలను సిబ్బందికి ఆయన అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.