ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్

ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్

MNCL: ముగ్గురు బైక్ దొంగలను అరెస్టు చేశామని డీసీపీ భాస్కర్ తెలిపారు. బుధవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. జన్నారం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి బెల్లంపల్లి, మంచిర్యాల, జన్నారం, తదితర ప్రాంతాలలో బైక్‌లను దొంగతనం చేశారన్నారు. వారిలో బత్తుల పరమేష్, రెంకల నరేష్, లావుడియా హరికృష్ణ లను అరెస్టు చేశామని, మిగిలినవారు పరారీలో  ఉన్నారని డీసీపీ తెలిపారు.