VIDEO: 'ధర్నా చేసేవారు నిజమైన రైతులు కాదు'

KMM: యూరియా కోసం రోడ్డెక్కి ధర్నా చేసేవారు నిజమైన రైతులు కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిజమైన రైతులు సొసైటీలకు యూరియా కోసం వచ్చి వాటిని తీసుకొని సంతోషంగా వెళుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో చెప్పారు. యూరియాపై రాజకీయం చేస్తూ కొందరు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. త్వరలోనే యూరియా సమస్య పరిష్కారం అవుతుందన్నారు.