కడప, కర్నూల్ నుంచి ఢిల్లీకి విమానాలు: రామ్మోహన్
ఉడాన్ పథకం కింద కడప, కర్నూల్ నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడపనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదిలాబాద్, నాగార్జున సాగర్‌లోని ఎయిర్ స్ట్రిప్‌లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 9 చోట్ల సీ ప్లేన్ పోర్టులను ఆపరేషన్‌లోకి తీసుకురావొచ్చని వెల్లడించారు. విజయవాడ ఎయిర్ పోర్టులో నిలిచిన పనులను మరో గుత్తేదారుకు అప్పగించినట్లు పేర్కొన్నారు.