వచ్చేనెల 13న లోక్ అదాలత్

వచ్చేనెల 13న లోక్ అదాలత్

AKP: లోక్ అదాలత్ ద్వారా కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 13న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లోనూ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు పార్టీల వారు రాజీకి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.