పట్టు సాగుతో సిరుల పంట: జిల్లా కలెక్టర్ సత్య శారద

WGL: పట్టు సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పేర్కొన్నారు. బుధవారం గీసుకొండ మండలంలోని దర్సు తాండ గ్రామంలో పట్టు పరిశ్రమ సాగు షెడ్డు నిర్మాణాన్ని తనిఖీ చేశారు. సాంప్రదాయ పంటలు వేసి నష్టపోకుండా ఆదాయం వచ్చే పట్టు సాగు చేపట్టాలని, గ్రామ రైతులు పంట మార్పిడి చేయాలన్నారు.